సిల్వర్తో సరిపెట్టుకున్న బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్

సిల్వర్తో సరిపెట్టుకున్న బ్యాడ్మింటన్  మిక్స్డ్ టీమ్

కామన్వెల్త్ గేమ్స్లో భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ నిరాశపర్చింది. గోల్డ్ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుని..సిల్వర్తో సరిపెట్టుకుంది. మలేషియాతో జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత టీమ్..రజతం సాధించింది. స్టార్ షట్లర్ పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్‌ సిల్వర్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మెన్స్ డబుల్స్ మ్యాచ్లో  భారత షెట్లర్లు చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ జోడి  మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా,వూయి యిక్‌ చేతిలో ఓడిపోయారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 21-18, 21-15 తేడాతో చిరాగ్‌-సాత్విక్‌ జంట పరాజయం చవిచూసింది.  ఆ తర్వాత ఉమెన్స్ సింగిల్స్‌లో పీవీ సింధు..  మలేషియా స్టార్‌ జిన్‌ వెయ్‌-గోహ్‌ను 22-20,  21-17తో మట్టికరిపించింది. దీంతో స్కోరు సమం అయింది. 

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతుంది. తాజాగా భారత్‌ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. భారత బ్యాడ్మింటన్‌ మిక్సడ్‌ టీమ్‌ విభాగం రజత పతకం సాధించింది. మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మెన్స్  సింగిల్స్‌లో మలేషియా షెట్లర్‌ జె యోంగ్‌ చేతిలో భారత్‌ షెట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌  21-19, 6-21, 21-16తో ఓడిపోవడంతో మలేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిగా జరిగిన ఉమెన్స్ డబుల్స్‌లో భారత్‌ జోడి త్రీసా జోలీ-గాయత్రి గోపిచంద్‌  చేతులెత్తేశారు. మలేషియన్‌ జంట మురళీధరన్ తీనా- కూంగ్ లే పెర్లీ టాన్ చేతిలో 21-18, 21-17తో  ఓటమి పాలవ్వడంతో భారత్‌ రెండో స్థానంతో సిల్వర్ ను దక్కించుకుంది. ఈ మెడల్ తో  భారత్‌ ఖాతాలో 13 పతకాలు చేరాయి. ఇందులో 5 స్వర్ణాలు, ఐదు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి.