అండర్ గ్రౌండ్ లో అద్భుతం..శ్రీశైలం పవర్ ప్లాంట్

అండర్ గ్రౌండ్ లో అద్భుతం..శ్రీశైలం పవర్ ప్లాంట్

భూగర్భంలో ఒక అద్భుతం.. శ్రీశైలం లెఫ్ట్‌బ్యాంక్‌ పవర్‌ ప్లాంట్ నిర్మాణం. శ్రీశైలం ప్రాజెక్టుస్పిల్‌ వేకు ఎడమ వైపున భూగర్భంలో 1.20 కిలోమీటర లోపల  నిర్మించి న ఈ ప్లాంట్ ను చూస్తే ఇంజనీరింగ్‌ స్కిల్ కు ఫిదా అవుతారు. లెఫ్ట్‌ బ్యాంక్‌ ఇంటేక్‌ టన్నెల్‌ నుంచి ప్లాంట్ లోకి నీటిని సరఫరా చేసి 6 యూనిట్ల ద్వారా రోజుకు 900 మెగావాట్ల కరెంట్‌ను ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చు. దేశంలోనే అత్యధిక కరెంట్‌ ఉత్పత్తి చేసే హైడల్‌ పవర్‌ స్టేషన్‌ ఇదేనని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. కరెంట్‌ ఉత్పత్తికి ఉపయోగించిన నీళను రివర్స్ బుల్‌ టర్బైన్ల ద్వారా తిరిగి శ్రీశైలంలోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. లేకుంటే డ్యామ్ కింద కిలో మీటర్ దూరంలో ఉన్న ఎగ్జిట్‌ గ్జి స్లూయిజ్‌ ద్వారా దిగువకు వెళ్లిపోవెళ్లి తాయి.

 2001లోప్రొడక్షన్ స్టార్ట్…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్‌ కష్టాలను తీర్చేం దుకు 1983లోనే ఈ పవర్‌ ప్లాంట్ ను నిర్మించా లని ప్రతిపాదించారు. ఐదు, ఆరో పంచవర్ష ప్రణాళికల్లోనూ దీన్ని చేర్చారు. 1994లోనే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 2000 సంవత్సరంలో పూర్తయింది. 2001 ఫ్లడ్‌ సీజన్‌లో కరెంట్‌ ఉత్పత్తి మొదలైంది. తొలి ఏడాది 307 మెగావాట్ల కరెంట్‌ ఉత్పత్తి చేశారు. 2004లో 3,154 గంటల పవర్‌ జనరేట్‌ చేశారు. ఏడాదిలో గరిష్టంగా 150 రోజుల వరకు కరెంట్‌ ఉత్పత్తి చేస్తున్నామని జెన్‌కో అధికారులు చెబుతున్నారు.

  • మొదట 110 మెగావాట్ల చొప్పున 9 యూనిట్లు ఏర్పాటు చేయాలని అనుకున్నారు.కానీతర్వాత150 మెగావాట్ల కెపాసిటీతో 6యూనిట్లు నిర్మించారు.
  •  ఈ ప్లాంట్లోని ఆరో యూనిట్‌ 2004లో అందుబాటులోకి వచ్చింది.
  •  శ్రీశైలం కుడిగట్టు పవర్‌ స్టేషన్‌ కెపాసిటీ 770మెగావాట్లు.
  • లెఫ్ట్, రైట్ ప్లాంట్లు రెండింటికీ విడుదల చేసే నీటిని తిరిగి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు రివర్సబుల్‌టర్బైన్లు ఉన్నాయి.
  •  శ్రీశైలంలోని రెండుపవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్‌ను తెలంగాణ, ఏపీ చెరి సగం పంచుకుంటాయి.
  • ఏటా తెలంగాణ జెన్‌కోనే ఎక్కువ కరెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది.
  • ఏపీఉత్పత్తి చేసిఉపయోగించుకునే కరెంట్‌ తెలంగాణతోపోల్చితేతక్కువగా ఉంటుంది.
  • ఎక్కువ ఉత్పత్తి చేసుకున్న కరెంట్కు  తెలంగాణ ప్రభుత్వం ఏపీకి డబ్బులు చెల్లిస్తుంది.
  • రోజు ఉత్పత్తి చేసే కరెంట్‌ విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా.
  • ఫ్లడ్‌సీజన్‌ ముగిసే సమయంలోరెండు రాష్ట్రాల ఇంజనీర్లు.. కేఆర్‌ఎంబీ మెంబర్‌(పవర్‌)తోసమావేశమై రెండు ప్లాంట్లలోఉత్పత్తి చేసిన కరెంట్‌ లెక్కలపై చర్చిస్తారు.