చైనా పోర్టుల్లో షిప్పుల లోడ్ దించనిస్తలే.. మనోళ్లను వెనక్కి రానిస్తలే..
నెలలుగా రెండు షిప్పులు.. మనోళ్లు 39 మంది అక్కడే చిక్కుకున్నరు
ఇతర దేశాల షిప్పులు, సిబ్బందికి నో ఆబ్జెక్షన్స్
చైనా తీరుపై విదేశాంగ శాఖ మండిపాటు
బీజింగ్: బార్డర్ లో ఆక్రమణలకు దిగుతూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా.. ఇండియన్లు సిబ్బంది ఉన్న మర్చెంట్ షిప్‌ల విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. నెలల తరబడి రెండు షిప్పులను పోర్టుల్లోనే నిలిపేసిన డ్రాగన్ కంట్రీ.. ఆ షిప్పుల నుంచి బొగ్గును అన్ లోడ్ చేయనివ్వడం లేదు. క్వారంటైన్ రూల్స్ పేరుతో అందులోని సిబ్బందిని మార్చేందుకూ అనుమతివ్వడం లేదు. అయితే ఇతర దేశాల సిబ్బంది ఉన్న షిప్పులకు మాత్రం అన్ని అనుమతులూ చకచకా ఇచ్చేస్తోందని చైనా తీరుపై గురువారం విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడింది. నెలల తరబడీ అక్కడే చిక్కుకుపోవడంతో ఇండియన్ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారని విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. ‘‘ఆస్ట్రేలియా నుంచి బొగ్గును తీసుకుని జూన్ 13న చైనా వచ్చిన ఎంవీ జగ్ ఆనంద్ షిప్‌ను చైనా జింటాంగ్ పోర్టులో ఆపేసింది. అందులో 23 మంది ఇండియన్ సిబ్బంది ఉన్నారు. అలాగే ఎంవీ అనస్టేసియా అనే మరో ఆస్ట్రేలియన్ షిప్పు సెప్టెంబర్ 20న చైనాలోని కావోఫీడియన్ పోర్టుకు వచ్చింది. అందులో 16 మంది ఇండియన్లు ఉన్నారు. షిప్పులను అన్లోడ్ లేదా సిబ్బందిని మార్చేందుకైనా అనుమతించాలని కోరుతున్నాం”అని శ్రీవాస్తవ వివరించారు. ఈ విషయంపై బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ ఆఫీసర్లు లోకల్ గవర్నమెంట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు.
రూల్స్ ప్రకారమే పనిచేస్తున్నం: చైనా
ఆస్ట్రేలియన్ షిప్పుల నిలిపివేత, ఇండియన్ సిబ్బంది చిక్కుకుపోవడం పట్ల తాము రూల్స్ ప్రకారమే వ్యవహరిస్తున్నామని చైనా వెల్లడించింది. ఇండియా, ఆస్ట్రేలియా దేశాలతో ఉద్రిక్త పరిస్థితులకు, ఈ రెండు షిప్పుల నిలిపివేతకు ఎలాంటి సంబంధంలేదని తెలిపింది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ వాంగ్ వెన్బిన్.. క్వారంటైన్ రూల్స్ కారణంగానే షిప్పులను ఆపేశామన్నారు. సిబ్బంది మార్పులు చేసుకునే పోర్టుల లిస్టులో జింటాంగ్ పోర్టు లేదన్నారు. కావోఫీడియన్ పోర్టులో చిక్కుకున్న షిప్పు గురించి లోకల్ ఆఫీసర్లనే అడగాలని సమాధానం దాటవేశారు.
For More News..
ఉచితంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్
రాత పరీక్ష లేకుండా బ్యాంక్ జాబ్
పార్కింగ్ ప్లేస్‌లు లేవు కానీ.. బండ్లకు ఫైన్లు
