జగన్ క్యాబినెట్ లో చోటు దక్కని కీలక నేతలు వీరే

జగన్ క్యాబినెట్ లో చోటు దక్కని కీలక నేతలు వీరే

నవ్యాంధ్రలో కొత్త ప్రభత్వం కొలువుదీరింది. 25 మంది మంత్రులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఏర్పాటైంది. సామాజిక సమతూకాన్ని పాటిస్తూ అన్ని వర్గాలకూ కేబినెట్‌లో చోటు కల్పించారు.

జగన్ కేబినెట్ కూర్పులో తమకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని పలువురు నేతలు భావించారు. కాని చివరికి ఆశించిన పదవి దక్కకపోవడంతో కొందరు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మరో కీలక నేత, జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డికి సైతం చోటు దక్కకపోవడం గమనార్హం.

కేబినెట్ లో చోటు దక్కని ముఖ్య నేతలు ఎవరంటే..

  • చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా
  • గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు(కాపు)
  • నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి
  • చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర రెడ్డి
  • మంగళగిరి ఎమ్మెల్యే-ఆళ్ల రామకృష్ణారెడ్డి
  • గుంటూరు జిల్లా- మర్రి రాజశేఖర్
  • చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి
  • కర్నూలు జిల్లా- శిల్పా కుటుంబం
  • పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
  • కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
  • కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు.

వీరందరూ కూడా జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలే. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ప్రస్తుత మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానని చెప్పిన వైఎస్ జగన్.. వీరందరికీ న్యాయం చేస్తారేమో వేచి చూడాలి