జాబ్ మారతరంట!

V6 Velugu Posted on Jan 19, 2022

తక్కువ శాలరీ, వర్క్‌‌‌‌‌‌‌‌-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడమే కారణం

న్యూఢిల్లీ: మెజార్టీ ప్రొఫెషనల్స్ ఈ ఏడాది జాబ్ మారాలనుకుంటున్నారని లింక్‌‌‌‌‌‌‌‌డిన్​ పేర్కొంది. వర్క్‌‌‌‌‌‌‌‌–లైఫ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్ లేకపోవడం, శాలరీ సరిపోకపోవడం వంటి కారణాలతో 82 శాతం మంది ప్రొఫెషనల్స్ జాబ్ మారాలని చూస్తున్నారని ఈ  సంస్థ ఓ రీసెర్చ్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో వివరించింది.  మొత్తం 1,111 మంది ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ నుంచి అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను  విడుదల చేసింది. కొత్తగా చేరాలనుకునే జాబ్‌‌‌‌‌‌‌‌లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండాలనుకుంటున్నారని లింక్‌‌‌‌‌‌‌‌డిన్ తెలిపింది. ‘కరోనా సంక్షోభం వలన  కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రజల ఆలోచనలు మారాయి. తమ లైఫ్‌‌‌‌‌‌‌‌లో టాప్ ప్రయారిటీలను చేరుకోవడానికి కొత్త అవకాశాల కోసం వెతుకుతున్నారు’ అని లింక్‌‌‌‌‌‌‌‌డిన్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌ ఇండియా మేనేజింగ్ ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంకిత్ వెంగర్లకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.  కొత్త జాబ్స్‌‌‌‌‌‌‌‌ పెరుగుతాయనే నమ్మకం జాబ్‌‌‌‌‌‌‌‌ సీకర్లలో పెరిగిందని చెప్పారు. స్కిల్‌‌‌‌‌‌‌‌ ఉన్న ఉద్యోగులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఫ్లెక్సిబిలిటీ వీరికి నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్ ప్రయారిటీగా ఉందని అభిప్రాయపడ్డారు. ఐటీ, హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బిజినెస్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ సెక్టార్లోని  ట్యాలెంట్ ఉన్న టెకీలకు ఫుల్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ ఉందని వెంగర్లకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. 

కరోనాతో వర్క్ సామర్ధ్యంపై డౌట్‌‌‌‌‌‌‌‌..

ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌కు తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై, తమ జాబ్ రోల్స్‌‌‌‌‌‌‌‌పై, కొత్తగా అందుబాటులోకి వచ్చే జాబ్స్‌‌‌‌‌‌‌‌పై  నమ్మకం పెరిగిందని లింక్‌‌‌‌‌‌‌‌డిన్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. ఇంత కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పటికీ 71 శాతం ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ మాత్రం తమ సామర్ధ్యా లపై కొంత అనుమానంగా ఉన్నామన్నారని తెలిపింది. తమ సామర్థ్యాలపై అనుమాన పడడం కరోనా ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఉందని లింక్‌‌‌‌‌‌‌‌డిన్ పేర్కొంది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది ఇంపోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిండ్రోమ్‌‌‌‌‌‌‌‌ ( తమ స్కిల్స్‌‌‌‌‌‌‌‌పై డౌట్‌‌‌‌‌‌‌‌ పడడం) తో బాధపడుతున్నామని పేర్కొన్నారు.  ‘ గత రెండేళ్ల నుంచి ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌లో (నాలుగు గోడల మధ్య) పనిచేయడంతో  ఇలా తమ స్కిల్స్‌‌‌‌‌‌‌‌పై డౌట్‌‌‌‌‌‌‌‌ పడడం పెరిగింది. కరోనా వలన వర్క్‌‌‌‌‌‌‌‌పై తమ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌ తగ్గిందని 33 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు’అని ఈ రిపోర్ట్ వివరించింది. 

ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలోనే ఉండాలంటే శాలరీ పెరగాలని, పనికి గుర్తింపు పెరగాలని, వర్క్‌‌‌‌‌‌‌‌– లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడాలని మెజార్టీ ప్రొఫెషనల్స్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం, వర్క్ బ్యాలెన్స్ బాగోకపోవడంతో మగవాళ్ల కంటే 1.3 రెట్లు ఎక్కువ మంది మహిళలు ప్రస్తుతం చేస్తున్న జాబ్‌‌‌‌‌‌‌‌ను వదిలేయాలనుకుంటున్నారు. 28 శాతం మంది మగవారు జాబ్‌‌‌‌‌‌‌‌ మారాలనుకుంటున్నామని చెప్పగా, 33 శాతం మంది మహిళలు జాబ్ మానాలని చూస్తున్నామని చెప్పారు.  అంతేకాకుండా మంచి శాలరీ అందితే ప్రస్తుతం చేస్తున్న జాబ్‌‌‌‌‌‌‌‌లోనే కొనసాగుతామని 49 శాతం మంది మహిళా రెస్పాండెంట్లు చెప్పారు. 

కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేంజ్‌‌‌‌‌‌‌‌ అవ్వాలి!

కరోనా వలన మెజార్టీ ఉద్యోగులు తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చుకోవాలని చూస్తున్నారని మరొక సర్వే పేర్కొంది.  ఇండీడ్‌‌‌‌‌‌‌‌ ఇండియా  చేసిన ఈ సర్వేలో  71 శాతం మంది రెస్పాండెంట్లు తమ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మార్చుకోవాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. కొత్త కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఎంటర్ అవ్వాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సర్వే కోసం మొత్తం 1,219 ఎంప్లాయర్ల నుంచి, 1,511 మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను కంపెనీ సేకరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది సరియైన జాబ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నామా? అని తమను తాము ప్రశ్నించుకుంటున్నారని పేర్కొంది. లైఫ్‌‌‌‌‌‌‌‌లోని ఇతర ప్రయారిటీలకు అనుగుణంగా జాబ్ ప్రయారిటీలను మార్చుకోవాలని 61 శాతం మంది చెప్పారు. కాగా, ప్రతీ పది మంది ఉద్యోగుల్లో ముగ్గురు తమ ప్రస్తుత జాబ్‌‌‌‌‌‌‌‌లను వదిలేయాలనుకుంటున్నారని ఇండీడ్ సర్వే పేర్కొంది. ఈ ఆలోచన మహిళలతో (19 శాతం మందితో) పోలిస్తే మగవారిలో (31 శాతం మందిలో) ఎక్కువగా ఉందని ఈ రిపోర్ట్ వివరించింది. కరోనా వలన ఉద్యోగుల ప్రయారిటీలు మారాయని ఇండీడ్ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం,  62 శాతం మంది జాబ్‌‌‌‌‌‌‌‌ శాటిస్ఫాక్షన్‌‌‌‌‌‌‌‌ ముఖ్యమని  అన్నారు.   శాలరీ, వర్క్‌‌‌‌‌‌‌‌–లైఫ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌కు 61 శాతం మంది ప్రయారిటీ  ఇచ్చారు. తమ కంపెనీల్లో వర్క్ ఫ్లెక్సిబిలిటీ లేదని 77 శాతం మంది ఉద్యోగులు పేర్కొనగా, జీతం కొంత తగ్గించినా వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్లెక్సిబిలిటీ మెరుగుపడిత ప్రస్తుత జాబ్‌లో  కొనసాగుతామని 7 శాతం మంది అన్నారు.

ఈ జాబ్‌‌‌‌‌‌‌‌లకు గిరాకీ..

ప్రస్తుతం డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉన్న జాబ్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌ను లింక్‌‌‌‌‌‌‌‌డిన్ ప్రకటించింది. జాబ్స్‌‌‌‌‌‌‌‌ కోసం వెతికేవారికి ఈజీగా ఉండడం కోసం ‘జాబ్స్ ఆన్‌‌‌‌‌‌‌‌ ది రైజ్‌‌‌‌‌‌‌‌ 2022 ఇండియా లిస్ట్‌‌‌‌‌‌‌‌’  సెకెండ్ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ను కంపెనీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఈ లిస్ట్ ప్రకారం, డేటా సైన్స్ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌, మెషిన్ లెర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైట్‌‌‌‌‌‌‌‌ రిలయబిలిటీ ఇంజినీర్ వంటి రోల్స్‌‌‌‌‌‌‌‌కు ఈ ఏడాది ఫుల్ డిమాండ్ ఉంది. ఈ జాబ్స్‌‌‌‌‌‌‌‌ కోసం స్కిల్స్ ఎక్కువగా ఉన్న ఐటీ వర్కర్లకు డిమాండ్ ఉందని  లింక్‌‌‌‌‌‌‌‌డిన్ ప్రకటించింది. ఆ తర్వాత మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్, బిజినెస్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ రిప్రజెంటేటివ్‌‌‌‌‌‌‌‌, స్ట్రాటజీ అసోసియేట్‌‌‌‌‌‌‌‌ వంటి బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ట్యాలెంట్ ఎక్కువగా ఉన్న ఉద్యోగులకు ఫుల్‌‌‌‌‌‌‌‌ గిరాకీ ఉంది. హెల్త్‌‌‌‌‌‌‌‌ కేర్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు, మాలిక్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయోలజిస్ట్‌‌‌‌‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. 2017 జనవరి నుంచి జులై, 2021 మధ్య  ఎక్కువ గ్రోత్‌‌‌‌‌‌‌‌ రేటు ఉన్న జాబ్స్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించి 2022 లిస్టును లింక్‌‌‌‌‌‌‌‌డిన్ విడుదల చేసింది.

Tagged linkedin, Job Professionals, IT Workers, Job Roles, Health Care Sector

Latest Videos

Subscribe Now

More News