సంక్రాంతి రేసు నుంచి వెంకీమామ ఔట్

సంక్రాంతి రేసు నుంచి వెంకీమామ ఔట్
  • ఫిబ్రవరిలో నవ్వుల పండగ

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్3’. రెండేళ్ల క్రితం ‘ఎఫ్2’తో మెప్పించిన వీరిద్దరూ ఈసారి ట్రిపుల్ ట్రీట్ గ్యారెంటీ అంటున్నారు. అయితే సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా రిలీజ్ డేట్‌‌ని మారుస్తూ కొత్త డేట్‌‌ని అనౌన్స్ చేశారు.  ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు కన్‌‌ఫర్మ్ చేస్తూ  ‘బొమ్మ ఎప్పుడు పడితే.. అప్పుడే మనకు నవ్వుల పండగ’ అంటూ ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి. వాస్తవానికి 2019 సంక్రాంతి విజేతగా ‘ఎఫ్‌‌2’ నిలిచినా.. ‘ఎఫ్​3’ ఏ పండగ సీజన్‌‌కు రావడం లేదని చెప్పారు మేకర్స్.  ఇలాంటి సినిమాకు ప్రత్యేక సందర్భాలు అవసరం లేదన్నారు. ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉందని చెప్పారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌‌లో షూటింగ్ జరుగుతోంది. వెంకటేష్​, వరుణ్‌‌ తేజ్‌‌తో సహా నటీనటులంతా పాల్గొంటున్నారు.  దిల్ రాజు సమర్పణలో శిరీష్  నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.