
- నవంబర్ 10న ఇండియా- యూఎస్ మీటింగ్
- భేటీ కానున్న ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు
న్యూఢిల్లీ : భారత్, అమెరికా దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం (2+2 డైలాగ్) శుక్రవారం ఢిల్లీలో జరగనుంది. అమెరికా తరఫున ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. భారత్ తరఫున రక్షణ మంత్రి రాజ్ నాథ్ తో పాటు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ భేటీలో పాల్గొననున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు లాయిడ్ ఆస్టిన్ గురువారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు ఎయిర్ పోర్టులో రాజ్ నాథ్ సింగ్ ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆయన సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 2+2 డైలాగ్ లో భాగంగా ఇరుదేశాల రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు ముందు వేర్వేరుగా, తర్వాత సంయుక్తంగా సమావేశమై ద్వైపాక్షి సంబంధాల విస్తరణపై రివ్యూ చేయనున్నారు. సమావేశంలో స్ట్రాటజిక్, డిఫెన్స్, టెక్నాలజీ వంటి అంశాల్లో సహకారంపై చర్చించనున్నట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.