ఢిల్లీలో కొనసాగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల భేటీ

ఢిల్లీలో కొనసాగుతున్న ఎన్డీయే మిత్రపక్షాల భేటీ

ఢిల్లీలోని అశోక్ హోటల్ లో మంగళవారం (జులై 18న) ఎన్డీయే మిత్ర పక్షాల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు 38 పార్టీల నేతలు హాజరయ్యారు. ఎన్డీయే కూటమి సమావేశానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమిని ఎదుర్కొనే విషయంలో వ్యూహాన్ని రూపొందించడంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి ముందు.. మోడీ ట్వీట్ చేశారు. మంగళవారం రోజు ఢిల్లీలో జరగే సమావేశానికి ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు హాజరు కావడం చాలా సంతోషకరమైన విషమంటూ ట్వీట్ చేశారు. ఓ వైపు బెంగళూరులో విపక్ష కూటమి సమావేశాలు మరోవైపు ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి భేటీతో జాతీయ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. విపక్షాల కూటమి పేరును INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ )గా నామకరణం చేసినట్లు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే అధికారికంగా వెల్లడించారు.