సికింద్రాబాద్, వెలుగు : గంజాయి మత్తులో ఉన్న యువకులు పెట్రోల్ బంక్‌కు వెళ్లి నిప్పుపెట్టారు. నాచారం పరిధి మల్లాపూర్ లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు శనివారం నలుగురు యువకులు వెళ్లారు. వాహనంలో పెట్రోల్ పోస్తుండగా, అక్కడే నిలబడి ఉన్న యువకుడు అగ్గిపెట్టె తీసి నిప్పంటించాడు.
దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అక్కడున్న వారు పరుగులు తీశారు. అప్రమత్తమైన బంక్ సిబ్బంది మంటలు ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
