ఉంగరం కోసం పరుగు

ఉంగరం కోసం పరుగు

శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జులై 7న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ ‘ప్రణీత్ కథ చెప్పినప్పుడు చాలా బాగుందనిపించింది.  కానీ  చెప్పింది తీయగలుగుతాడా అనే భయం కూడా వేసింది. ఫస్ట్ కాపీ చూసిన తరువాత నేను అనుకున్న దానికంటే పది రెట్లు ఎక్కువగా తీశాడు.  శ్రీసింహాకు ఈ జానర్‌‌ బాగా సెట్ అవుతుంది. 

హీరో పాత్ర పేరు అర్జున్. సులభంగా ఎదగాలనుకునే  కుర్రాడు. దీనికోసం మోసాలు చేయడంతో  సమస్యలు ఎదురవుతాయి.  ఒక  రింగ్  కీ రోల్ ప్లే చేస్తుంది. మొత్తం సినిమా ఈ రింగ్ చుట్టూ తిరుగుతుంది. ఈ  క్రైమ్ కామెడీ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాం.  ఈ జానర్‌‌లో తక్కువ సినిమాలు వచ్చినా.. ఎక్కువ హిట్స్ వచ్చాయి. అందుకే ఈ చిత్రంపై మాకు కూడా నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని సురేష్ డిస్ట్రిబ్యూషన్ వాళ్లు విడుదల చేస్తున్నారు’ అని చెప్పారు.