Hyderabad Metro Rail: హైద్రాబాద్ మెట్రోలో డైలీ వెళ్తుంటారా.. కొందరికి ఇది బ్యాడ్ న్యూసే..!

Hyderabad Metro Rail: హైద్రాబాద్ మెట్రోలో డైలీ వెళ్తుంటారా.. కొందరికి ఇది బ్యాడ్ న్యూసే..!

హైద్రాబాద్ మెట్రో రైల్లో ఫ్రీ పార్కింగ్కు ఎల్ అండ్ టి మెట్రో సంస్థ స్వస్తి పలికింది. ఇక నుంచి అన్ని మెట్రో స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. ఆగస్టు 25 నుంచి నాగోల్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ అండ్ స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయనున్నారు. హైద్రాబాద్ మెట్రో ప్రయాణికులపై  అదనంగా పార్కింగ్ భారం పడనుంది. మెట్రో స్టేషన్స్ వద్ద ఉచిత పార్కింగ్ ఎత్తేయడంపై మెట్రోలో రోజూ ప్రయాణించే ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో  రోజుకు 4.5 నుంచి 5 లక్షల ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. 59 స్టేషన్స్లో 35 నుంచి 40 స్టేషన్స్ వద్ద మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. టూ వీలర్ పార్కింగ్, కార్ పార్కింగ్ చేసిన వెహికిల్కు ఎలాంటి సేఫ్టీ లేదు. కానీ మెట్రో పార్కింగ్ స్థలాల్లో మెరుగైన సేవలు అందించేందుకే మెట్రో పార్కింగ్ ఫీజ్ అమలు చేస్తున్నట్టు ఎల్ అండ్ టి మెట్రో చెబుతోంది.

గతంలోనే అమీర్ పేట్ లాంటి ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్ను అమలు చేశారు. ఇప్పుడు నాగోల్ స్టేషన్ వద్ద ఫ్రీ పార్కింగ్ను ఎత్తేశారు. మెట్రో స్టేషన్స్ వద్ద పెయిడ్ పార్కింగ్ 2 గంటలకు10 రూ. అప్ టూ 8 గంటల వరకు ఉంటే 25 రూ. 12 గంటలకు రూ.40, ఎక్ట్రా గంట అయితే 5 రూ. చల్లించాలి. ఇక కార్ పార్కింగ్ అయితే రెండు గంటల వరకు రూ.30, అప్ టూ 8 గంటల వరకు 75, 12 గంటలైతే 120, ఈ ఛార్జీలతో పాటు ఎక్ట్రా గంట టైమ్ 15 రూ. ఛార్జ్ చేయనున్నారు. ఇక మంత్లీ పార్కింగ్ పాస్లపై 40 శాతం వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. పార్కింగ్ ఫీజు తీసుకుంటున్నా పార్కింగ్ ఎట్ ఓనర్స్ రిస్క్ అని బోర్డు కనిపించడం ఇక్కడ పెద్ద ట్విస్ట్.