V6 News

అసలు సిసలు గాడ్సే ప్రగతిభవన్ లో ఉన్నాడు

అసలు సిసలు గాడ్సే ప్రగతిభవన్ లో ఉన్నాడు

హైదరాబాద్: అసలు సిసలు గాడ్సే ప్రగతి భవన్ లో ఉన్నాడని.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని చంపిన గాడ్సే కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గాడ్సే గాంధీ భవన్ లో లేడని..  అసలుసిసలు గాడ్సే ప్రగతి భవన్ లోనే వున్నాడన్నారు. గాంధీని గాడ్సే చంపితే..  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను చంపిన గాడ్సే కేసీఆర్ అన్నారు. తెలంగాణ ద్రోహులు ఎలా మంత్రులయ్యారు ? అని ఆయన ప్రశ్నించారు. 
ప్రైవేటు ఫంక్షన్లలో రాజకీయ నాయకులు కలవడం సహజం
ప్రైవేట్ ఫంక్షన్ లో రాజకీయ నాయలుకు కలవడం సహజం.. రేవంత్, ఈటల కలవడాన్ని తప్పు పడితే ఎలా..? నువ్వు ఎవర్ని కలవడం లేదా కేటీఆర్.? అని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడన్నారు. కాంగ్రెస్, బిజెపిలు ఏనాడు కలిసి పనిచేయవని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకుడని.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశాకే.. పీసీసీ చీఫ్ గా నియమించిందని అద్దంకి దయాకర్ వివరించారు.