The Paradise Box Office: మిక్స్‌డ్ టాక్‌తో ‘ది పారడైజ్’.. నాని హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి?

The Paradise Box Office: మిక్స్‌డ్ టాక్‌తో ‘ది పారడైజ్’.. నాని హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి?

నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు నాని పెర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్రశంసిస్తుండగా.. మరికొందరు కథనం, ఎగ్జిక్యూషన్‌పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ సినిమాకు ముందే జరిగిన భారీ బిజినెస్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. ‘ది పారడైజ్’ నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచిందని ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి.

రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్!

SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘ది పారడైజ్’ థియేట్రికల్ రైట్స్ ఊహించని ధరకు అమ్ముడయ్యాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం, ‘ది పారడైజ్’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.75.7 కోట్లు జరుపుకుందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో నైజాం రూ.35 కోట్లు, సీడెడ్ రూ.10 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.8.5 కోట్లు, గుంటూరు రూ.5.4 కోట్లు, ఈస్ట్ రూ.5.6 కోట్లు, వెస్ట్ రూ.4 కోట్లు, కృష్ణా రూ.4.5 కోట్లు, నెల్లూరు రూ.2.7 కోట్లుగా చెబుతున్నారు. ఇక కర్ణాటక నుంచి రూ.6.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి రూ.3.5 కోట్లు, ఓవర్సీస్ నుంచి రూ.18 కోట్ల బిజినెస్ కలిపితే.. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ విలువ సుమారు రూ.103.7 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

హిట్ కొట్టాలంటే ఎంత రాబట్టాలి?

ఇక్కడే అసలు బాక్సాఫీస్ గేమ్ మొదలవుతుంది. రూ.103.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిన నేపథ్యంలో.. సినిమా క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే రూ.105 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ షేర్ (నెట్) సాధించాల్సి ఉంటుందని ట్రేడ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంటే దాదాపు రూ.200 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ రాబట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే ‘ది పారడైజ్’ ముందు ఉన్న టార్గెట్ చిన్నదేమీ కాదు. భారీ బిజినెస్‌కు తగ్గట్టుగా బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న మిక్స్డ్ టాక్ నేపథ్యంలో సినిమా ఏ మేరకు స్టడీగా వసూళ్లు సాధిస్తుందనేది కీలకంగా మారింది.

బడ్జెట్ ఎంతంటే?

బడ్జెట్ విషయంలో ట్రేడ్, మీడియా రిపోర్టుల్లో భిన్నమైన లెక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ సినిమాను రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. మరోవైపు ముందస్తు ట్రేడ్ అంచనాల్లో దాదాపు రూ.200 కోట్ల వరకు బడ్జెట్ అని కూడా లెక్కలు చెబుతున్నాయి. క్లారిటీ రావాల్సి ఉంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో నాని సరికొత్త రికార్డులు

మరోవైపు టాక్ కంటే ముందే ‘ది పారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర తన స్టామినాను చూపించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో నాని కెరీర్‌లోనే కొత్త రికార్డులు నమోదయ్యాయి. ట్రేడ్ ట్రాకింగ్ ప్రకారం ఓపెనింగ్ డే ప్రీ-సేల్స్ రూ.40 కోట్ల మార్క్‌ను దాటాయి. మరో ట్రాకర్ ఇండియాలోనే 9,966 షోలకు 10.39 లక్షల టికెట్లు బుక్ కాగా, రూ.23.23 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైనట్లు వెల్లడించింది. ఓవర్సీస్‌లోనూ సినిమా బుకింగ్స్ భారీ స్థాయిలో సాగాయి. ప్రీమియర్స్‌కు ముందు $1.5 మిలియన్‌కు పైగా ప్రీ-సేల్స్ నమోదైనట్లు రిపోర్టులు వచ్చాయి.

టాక్ ఎలా ఉన్నా.. ఇప్పుడు అసలు పరీక్ష!

అడ్వాన్స్ బుకింగ్స్‌తో భారీ ఓపెనింగ్‌కు బేస్ వేసుకున్న ‘ది పారడైజ్’.. ఇప్పుడు మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని వసూళ్లను నిలబెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే రూ.103.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఈ సినిమాకు రూ.105 కోట్లకు పైగా షేర్, దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ అనే భారీ బ్రేక్-ఈవెన్ టార్గెట్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ నాని కెరీర్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసినా.. అసలు లెక్క మాత్రం టాక్ తర్వాత వచ్చే వసూళ్లతోనే తేలనుంది. మొదటి రోజు భారీ నంబర్లు నమోదు చేసిన తర్వాత వీకెండ్‌లో సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందనేదే ‘ది పారడైజ్’ బాక్సాఫీస్ జర్నీలో కీలకంగా మారనుంది.