సిద్ధాంతం పక్కనపెట్టి.. పదవుల కోసం జతకడ్తరా? : జాతీయ నాయకత్వం

సిద్ధాంతం పక్కనపెట్టి.. పదవుల కోసం జతకడ్తరా? : జాతీయ నాయకత్వం
  •     బీజేపీ రాష్ట్ర నేతల తీరుపై జాతీయ నాయకత్వం ఆగ్రహం 
  •     మున్సిపోల్స్​లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌‌‌కు ఎలా సపోర్ట్ చేస్తారని క్వశ్చన్‌‌‌‌
  •     తక్షణమే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడికి అధిష్టానం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల తీరుపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం మండిపడింది. పార్టీ విధా నాలకు తిలోదకాలిచ్చి, స్థానిక అవసరాల పేరిట ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలపడాన్ని ఢిల్లీ పెద్దలు సీరియస్‌‌‌‌గా తీసుకున్నారు. పదవుల కోసం రాష్ట్ర నేతలు, ప్రజాప్రతినిధులు ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో రకం గా వ్యవహరించడం ఏంటని రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారు. 

ఎక్కడికక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు పలకడం, వైస్ చైర్మన్ పదవులను పంచుకోవడంలాంటి పరిణామాలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ రాంచంద్రరావును కేంద్ర నాయకత్వం ఆదేశించింది. 

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 336 వార్డు  స్థానాల్లో విజయం సాధించింది. అయితే, చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికలో పలుచోట్ల బీజేపీ అభ్య ర్థులు కీలకంగా మారారు. మున్సిపల్ ఎన్నికల ఫలి తాల అనంతరం.. ఎక్స్ అఫీషియో ఓట్లు, కౌన్సిలర్ల మద్దతు విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉండా లని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు అధికారికం గా ప్రకటించారు. 

కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందు కు భిన్నంగా మారింది. పార్టీ ఆదేశాలను పక్కనపెట్టి పలు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ కౌన్సిలర్లు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమన్‌‌‌‌గల్, నర్సాపూర్, అలియాబాద్  మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌‌‌‌కు మద్దతిచ్చి.. వైస్ చైర్మన్  పోస్టులను పంచుకున్నారు. జిన్నారం, ఎల్లంపేట మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌‌‌‌తో కలిసి వైస్ చైర్మన్  పదవులను పొందారు. ఈ విషయం జాతీయ నాయకత్వం దృష్టికి చేరడంతో సీరియస్ అయింది.