పార్టీ ముఖ్యులతో ప్రధాని మోడీ భేటీ

పార్టీ ముఖ్యులతో ప్రధాని మోడీ భేటీ

న్యూఢిల్లీ: బీజేపీ ముఖ్య నేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. కీలక నేతల సమావేశానికి సంబంధించిన వివరాలను పార్టీ బయటకు వెల్లడించలేదు. దీనిపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. ఈ ఏడాది చివర్లో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడం, వచ్చే ఏడాది జరగనున్న లోక్​సభ ఎన్నికలపై నేతలు చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. 

ప్రభుత్వంలో, కేబినెట్​లో మార్పులు చోటుచేసుకోనున్నాయని, కేబినెట్ విస్తరణపై నా చర్చించనున్నారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.