V6 News

ఐపీఎల్ ఇక్కడే జరపాలంటూ పిటిషన్

ఐపీఎల్ ఇక్కడే జరపాలంటూ పిటిషన్

ముంబై: ఐపీఎల్13వ ఎడిషన్ ను ఇండియాలోనే నిర్వహించేలా బీసీసీఐని, ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ బాంబే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అభిషేక్ లాగో అనే అడ్వకేట్ ఈ పిటిషన్ వేశారు. ‘ఐపీఎల్ చారిటీ ఈవెంట్ కాదు. కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో లీగ్ ఇండియాలో జరిగితే అది మన ఎకానమీకి బూస్టప్ అవుతుంది. ప్రస్తుతం మన దేశానికి అది అత్యవసరం. ఐపీఎల్ కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు
సడలింపులిచ్చింది. ప్రభుత్వం అదే చొరవ తీసుకుని సురక్షితమైన వాతావరణంలో లీగ్ ఇండియాలోనే జరిగేలా చర్యలు తీసుకునేలా ఆదేశించాలి’ అని పిటిషనర్ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..