కత్తులు, రివాల్వర్ తో ఫొటోలు దిగి బెదిరింపులు

 కత్తులు, రివాల్వర్ తో ఫొటోలు దిగి బెదిరింపులు

వికారాబాద్ జిల్లా దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భూవివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రివాల్వర్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది వైరల్‌ కావడంతో పోలీసులు అతడిని స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ రివాల్వర్ అడ్వకేట్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.  మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం అయితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సదరు వ్యక్తి ఇటీవలె బెయిల్ పై విడుదలయ్యాడు. గతంలో కూడా అతడు కత్తులు పట్టుకుని ఫొటోలు దిగి తనను ఎవరు ఏమి చేయాలేరంటూ పలు పోస్టులు పెట్టాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.