మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో 600 పేజీల ఛార్జ్షీట్

మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో 600 పేజీల ఛార్జ్షీట్

మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో పోలీసులు 600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సీసీ ఫుటేజ్, డీఎన్ఏ రిపోర్ట్, యాక్సిడెంట్లు, వెపన్ దుర్వినియోగం, బాధితురాలి స్టేట్మెంట్లను ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే కోర్టులో అన్ని ఆధారాలు సమర్పించారు.  

ఇటీవలె సీఐ నాగేశ్వరరావు రావును సర్వీస్ నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున ఆర్టికల్ 311(2) బి కింద సర్వీస్ రిమూవల్ చేశారు. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాయగా..సీపీ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది. పోలీస్ శాఖ హైదరాబాద్ లో 39 మందిని సర్వీస్ నుంచి తొలగించింది. వనస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో ఆయన జైలుకెళ్లి ఇటీవలె బెయిల్పై విడుదలయ్యారు.