ఆసియా గేమ్స్ హాకీలో దీపిక 9 గోల్స్‌‌‌‌ తో రికార్డు...

ఆసియా గేమ్స్ హాకీలో దీపిక 9 గోల్స్‌‌‌‌ తో రికార్డు...

కాకామిగహరా: ఆసియా క్రీడల విమెన్స్‌‌‌‌ హాకీ పోటీలలో ఇండియా జట్టు జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పూల్–-బి మ్యాచ్‌‌‌‌లో ఇండియా 20–1 గోల్స్ తేడాతో థాయిలాండ్‌‌‌‌ను చిత్తు చేసింది. 

టోర్నీలో భారత్‌‌‌‌కు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. డ్రాగ్ ఫ్లికర్ దీపిక సెహ్రావత్ (2, 8, 9, 24, 33, 36, 39, 51, 57 నిమిషాలు) ఒకే మ్యాచ్‌‌‌‌లో రికార్డు స్థాయిలో తొమ్మిది గోల్స్ సాధించి చరిత్ర సృష్టించింది. 

నవ్‌‌‌‌నీత్ కౌర్ (4, 29, 35, 51 నిమిషాలు), రుతుజ దాదాసో పిసాల్ (10, 11, 47 నిమిషాలు) గోల్స్‌‌‌‌ కొట్టారు. నేహా గోయల్, లాల్‌‌‌‌రెమ్సియామి, సాక్షి రాణా, కెప్టెన్ సలిమా టెటే కూడా గోల్స్ సాధించారు. థాయిలాండ్ తరఫున సుపన్సా సంన్సో ఏకైక గోల్ సాధించింది.