ఉప్పల్, వెలుగు : లారీలో గుజరాత్కు తరలించడానికి సిద్ధంగా ఉన్న పీడీఎస్రైస్ను పోలీసులు సీజ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఉప్పల్ పారిశ్రామిక వాడలో సుమారు 400 బస్తాల్లో 45 క్వింటాళ్ల బియ్యాన్ని డంపింగ్చేశారు.
వీటిని లారీలో గుజరాత్కు గురువారం తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో ఉప్పల్పోలీసులు దాడి చేశారు. మహమ్మద్ ఖలీమ్, బషీర్, అఫ్జల్, జకారియా, కోడియాకర్ భరత్, యోగేశ్, రంజిత్ ముఖియా, బబ్లు ముకీయ, మతర్ ముఖియాను అరెస్టు చేసినట్లు ఎస్సై మాధవరెడ్డి తెలిపారు.