
- వైశ్య వికాస వేదిక ఫౌండర్ సత్యనారాయణ గుప్తా
ముషీరాబాద్, వెలుగు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చాలని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. వైశ్యులు పేరుకే అక్రవర్ణాలుగా ఉన్నారని, మార్వాడీ వ్యాపారాల వల్ల తాము నిర్వీర్యం అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో వైశ్యుల జనాభా శాతాన్ని అధికారికంగా ప్రకటించాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారానే పేద వైశ్య స్టూడెంట్లకు న్యాయం జరుగుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు తమకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, ముక్కా సాంబశివరావు, కాచం సుష్మా, రమేశ్, రామ్ నరేశ్,
కొత్త రవి పాల్గొన్నారు.