రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పీటీ ఉషా, వీరేంద్ర హెగ్డే

రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పీటీ ఉషా, వీరేంద్ర హెగ్డే

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ప్రముఖ దర్శకులు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌తో పాటు సంగీత దిగ్గజం ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ సందర్భంగా వారు అందించిన  సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ట్వీట్‌ చేశారు.

 

ఇళయరాజా సంగీతం అనేక భావాలకు ప్రతిబింబమని, అనేక తరాలకు అదో వారధిలా నిలిచిందని ప్రధాని మోడీ కొనియాడారు. పీటీ ఉష జీవితం.. ప్రతి భారతీయుడికీ ఆదర్శనీయమన్నారు. అనేక ఏళ్లుగా ఎందరో క్రీడాకారుల్ని ఆమె తీర్చిదిద్దారన్నారు. విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాల పాటు సృజనాత్మక సేవలు అందించారని.. ఆయన సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు.