ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం కోల్డ్ స్టోరేజీలో ఉన్న తేజ మిర్చి ఆల్‌టైం రికార్డ్ ధర పలికింది. వ్యాపారులు క్వింటాల్ మిర్చిని రూ.20,021కి కొనుగోలు చేశారు. వారం రోజులుగా మిర్చికి విపరీతమైన డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన మిర్చిని వ్యాపారులు అధిక ధరకు కొన్నారు. సుమారు 150 బస్తాలను కొనుగోలు చేశారు. మరో రెండు రోజులు మిర్చికి ఇదే డిమాండ్ ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు

