టీచర్లు బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలె : సబిత

టీచర్లు బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలె : సబిత

రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ల ప్రక్రియను ఆమె సమీక్షించారు. జవాబుదారీతనంతో, లోపాలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సబిత చెప్పారు. వెబ్ కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సబితాఇంద్రారెడ్డి అన్నారు. పదోన్నతులు, బదిలీల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఆదేశించారు.