పైసలడిగితే తలుపులు మూసిండు

పైసలడిగితే తలుపులు మూసిండు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పోస్టాఫీస్‌ లో జమ చేసుకున్న డబ్బులను అడిగితే పోస్టు మాస్టర్‌ తలుపులు మూశాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్‌‌‌‌‌‌‌‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన ఖాతాదారులు జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీసులో ప్రతినెలా డబ్బులు జమ చేస్తున్నారు. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌ తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఐదు రోజుల నుంచి డబ్బులు ఇవ్వాలని పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. పోస్టుమాస్టర్‌ మాత్రం సర్వర్‌ డౌన్‌ ఉంది.. ఇవాళ.. రేపు.. అంటూ తిప్పి పంపిస్తున్నాడు.

శుక్రవారం డబ్బులు కావాల్సిందేనని గట్టిగా అడగడంతో డబ్బుల్లేవ్.. దిక్కున్నచోట చెప్పుకోండని తలుపులు మూసి గడియపెట్టాడు. దీంతో కొందరు లోపల ఇంకొందరు బయటే ఉండిపోయారు. ఈ సందర్భంగా ఖాతాదారులు, పోస్ట్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై ఆయనను వివరణ కోరగా సర్వర్‌ ప్రాబ్లం ఉందని, క్లియర్‌ కాగానే డబ్బులు చెల్లిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈసారి బోనాల పండుగ లేనట్లే

నిజంగానే రాజ్​భవనం

అరటిపండ్లు అమ్ముతున్న టీచర్