రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్ లో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ . సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 9న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ.. ప్రభాస్ వింటేజ్ లుక్, కామెడీ టైమింగ్ అభిమనులను ఖుషీ చేసింది. వెండితెరపై అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ దునియాలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది. ఈ సినిమాను ఫిబ్రవరి 6న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ సర్వర్ల అప్‌గ్రేడ్
అయితే ప్రభాస్ సినిమా క్రేజ్ దెబ్బకు జియో హాట్‌స్టార్ సర్వర్లపై తీవ్రమైన ఒత్తిడి పడింది. ఓటీటీలోకి రాకముందే లక్షలాది మంది ‘రిమైండ్ మి’ బటన్ క్లిక్ చేయడంతో యాప్‌కు విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది. దీంతో జియో హాట్‌స్టార్ టీమ్ రంగంలోకి దిగి ఒక అడుగు ముందే వేసింది. స్ట్రీమింగ్ సమయంలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తమ సర్వర్లను భారీగా అప్‌గ్రేడ్ చేసినట్లు సంస్థ ప్రకటించింది. ప్రభాస్ డిజిటల్ డెబ్యూ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో దీనిని బట్టి అర్థమవుతోందో తెలుస్తోంది.
Thanks to all the fans for the love and support ♥️ #TheRajaSaabOnJioHotstar #TheRajaSaab #JioHotstar pic.twitter.com/YUoyYRUT2K
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 5, 2026
ఓటీటీలో ‘ఎక్స్‌టెండెడ్ వెర్షన్’ మ్యాజిక్
థియేటర్లలో విడుదలైన వెర్షన్ కంటే ఓటీటీలో రాబోయే వెర్షన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ‘ది రాజాసాబ్’ ఎక్స్‌టెండెడ్ కట్ (Extended Cut) అందుబాటులోకి వస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో థియేటర్లలో మిస్ అయిన సుమారు 8 నుంచి-10 నిమిషాల నిడివి గల సీన్లను జోడించారు. ముఖ్యంగా టీజర్, ట్రైలర్‌లో కనిపించి థియేటర్లో లేని ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్లు ఇప్పుడు ఓటీటీలో దర్శనమివ్వనున్నాయి. గతంలో దర్శకుడు మారుతి చెప్పినట్లుగా, సర్వర్ ఇష్యూల వల్ల థియేటర్లో మిస్ అయిన భారీ రూఫ్ టాప్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
►ALSO READ | Kangana Ranaut: మోడ్రన్ 'ఇందిరమ్మ'లా కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 208 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ గ్లామర్.. సంజయ్ దత్ గంభీరమైన నటన సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. థమన్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వెండితెరపై మిస్ అయిన వారు, ప్రభాస్ వింటేజ్ స్వాగ్‌ను మళ్ళీ చూడాలనుకునే వారు స్ట్రీమింగ్ కోసం సిద్ధంగా ఉండండి!
