14 రూట్లను హైవేలుగా మార్చండి.. ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపిన ఆర్అండ్ బీ

14 రూట్లను హైవేలుగా మార్చండి.. ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపిన ఆర్అండ్ బీ

14 రూట్లను హైవేలుగా మార్చండి

ప్రపోజల్స్ ను కేంద్రానికి పంపిన ఆర్అండ్ బీ

హైదరాబాద్, వెలుగు : రాష్ర్టంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న 14 రోడ్లను నేషనల్ హైవేలుగా గుర్తించాలని కేంద్రాన్ని  ఆర్ అండ్ బీ అధికారులు కోరారు. ఇటీవల  కేంద్ర రవాణా శాఖ సెక్రటరీకి ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాసరాజు లేఖ రాశారు. ఈ 14 రోడ్లను  ( మొత్తం 1,656.5 కిమీ) నేషనల్ హైవేలుగా గుర్తించటం వల్ల జిల్లాల కేంద్రాలకు ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ పెరగటంతో పాటు, పారిశ్రామికంగా, టూరిజంపరంగా ఎంతో  అభివృద్ధి జరుగుతుందని అధికారులు లేఖలో  పేర్కొన్నారు. 

14 రూట్ల వివరాలు

* చౌటుప్పల్, ఆమన్ గల్, షాద్ నగర్, సంగారెడ్డి  182 కిమీ
* కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి,  పిట్లం 165 కిమీ
* వనపర్తి, కొత్తకోట, గద్వాల, మంత్రాలయం 110 కిమీ
* ఎర్రవల్లి, గద్వాల్, రాయచూర్  67కిమీ
* మన్నెగూడ , వికారాబాద్, తాండూర్, జహీరాబాద్,  బీదర్ 133కిమీ
* మరికల్, నారాయణపేట్,  రామసముద్ర 63 కిమీ
* జగిత్యాల, జంగాలపల్లి  164 కిమీ
* సారపాక, ఏటూరునాగారం  93కిమీ
* పుల్లూరు నుంచి నల్గొండ  225కిమీ
* దుద్దెడ నుంచి రాయగిరి  163కిమీ
* జగ్గయ్యపేట, కొత్తగూడెం 100 కిమీ
* సిరిసిల్ల, కోరుట్ల 65కిమీ
* భూత్పూర్​ నుంచి సిరిగిరిపాడు 165.5కిమీ
* కరీంనగర్, రాయపట్నం 60 కిమీ