V6 News

నేచురల్ గ్యాస్‌ రేటు ఇక కంపెనీల ఇష్టమే

నేచురల్ గ్యాస్‌ రేటు ఇక కంపెనీల ఇష్టమే

న్యూఢిల్లీ : నేచురల్‌‌ గ్యాస్‌‌ ధరల నిర్ణయంలో రిలయన్స్‌‌ సహా ప్రైవేటు కంపెనీలకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్కెట్‌‌ ప్రైస్‌‌ డిస్కవరీకి రూపొందించిన గైడ్‌‌లైన్స్‌‌ పాటిస్తే  ప్రైవేటు కంపెనీలకు ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో ప్రొడ్యూస్‌‌ చేసే నేచురల్‌‌ గ్యాస్‌‌కు ఈ–బిడ్డింగ్‌‌ ప్రక్రియ ద్వారా ధరల డిస్కవరీకి గత వారం గైడ్‌‌లైన్స్‌‌ను పెట్రోలియం అండ్‌‌ నేచురల్‌‌ గ్యాస్‌‌ మినిస్ట్రీ విడుదల చేసింది. ఓఎన్‌‌జీసీ, ఆయిల్‌‌ ఇండియాల చేతిలోని పాత ఆయిల్‌‌ ఫీల్డ్స్‌‌ మినహా మిగిలిన అన్ని ఆయిల్‌‌ ఫీల్డ్స్‌‌లోనూ ప్రొడ్యూస్‌‌ చేసే నేచురల్‌‌ గ్యాస్‌‌ రేటు నిర్ణయంలో 2017 నుంచే కంపెనీలకు స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. అప్పటి నుంచే రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌–బీపీ జాయింట్‌‌ వెంచర్‌‌, ఓఎన్‌‌జీసీలు రేట్ల నిర్ణయానికి యూజర్లకు ఆక్షన్స్‌‌ను నిర్వహిస్తున్నాయి. ధరల నిర్ణయం ఫార్ములాను అవి ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చని, కాకపోతే ఇప్పుడు  అయిదు ప్రి సెలెక్టెడ్‌‌ ఏజన్సీల ఎలక్ట్రానిక్‌‌ ప్లాట్‌‌ఫామ్స్‌‌ పైనే  బిడ్స్‌‌ తీసుకోవాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వులలో తెలిపింది.  ఎస్‌‌బీఐ క్యాపిటల్‌‌ మార్కెట్స్‌‌, ఎంజంక్షన్‌‌ సర్వీసెస్‌‌, రైట్స్‌‌, ఎంఎస్‌‌టీసీ, క్రిసిల్‌‌ రిస్క్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రా సొల్యూషన్‌‌ల ఎలక్ట్రానిక్‌‌ ప్లాట్‌‌ఫామ్స్‌‌ను వాడుకోవాలని సూచించింది. ధరల నిర్ణయంలో వెసులుబాటున్న బ్లాకుల విషయంలో మార్కెటింగ్‌‌కూ అక్టోబర్‌‌ నుంచి స్వేచ్ఛను ఇచ్చింది. ప్రైస్‌‌ బిడ్డింగ్‌‌ కోసం కొన్ని పద్ధతులనూ ప్రకటించింది.