
కన్నడలో ఇటీవల విడుదలైన ‘సు ఫ్రమ్ సో’ సినిమాకు అక్కడ మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు ఈ చిత్రం అదే టైటిల్‌తో ఆగస్టు 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తారనే నమ్మకం ఉంది.
అందర్నీ ఎంటర్‌టైన్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. ఈవీవీ సత్యనారాయణ గారి సినిమాల తరహాలో ఇది కూడా కంప్లీట్ ఎంటర్‌టైనర్ అని మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి అన్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నటుడు షనీల్ గౌతమ్, దర్శకుడు జేపీ తుమినాడ్ అన్నారు.
నిర్మాత రాజ్ బి శెట్టి మాట్లాడుతూ ‘ఇంత మంచి కంటెంట్‌ని ఆదరిస్తున్న మైత్రి శశి గారికి, నవీన్ గారికి థాంక్యూ. ఈ సినిమా చాలా మంచి ఎంటర్‌టైనర్. కన్నడలో అద్భుతాలు సృష్టించింది. తెలుగు ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.