ప్రవళిక మృతిపై గవర్నర్​కు నివేదిక

ప్రవళిక మృతిపై గవర్నర్​కు నివేదిక

హైదరాబాద్, వెలుగు: గ్రూప్స్ అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య కేసు రిపోర్ట్ గవర్నర్ ఆఫీసుకు చేరింది. శుక్రవారం జరిగిన ఘటన ప్రవళిక ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ సిటీ సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు సోమవారం గవర్నర్ కు నివేదిక పంపించారు. ప్రవళిక ఉరివేసుకున్న హాస్టల్ లో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్, కాల్ సీడీఆర్, గ్రూప్ 4 పరీక్ష హాల్ టికెట్ ను రిపోర్ట్ కు జత చేశారు. 

ఇద్దరు హాస్టల్ ఫ్రెండ్స్, ప్రవళిక మృతి చెందిన రోజు ముగ్గురు ఫ్రెండ్స్​కు చేసిన వాట్సాప్ వివరాలు పేర్కొన్నారు. 4  నెలల కాల్ డేటా శుక్రవారం ఉదయం 11.25 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ ఫొటోస్  గవర్నర్ కు ఇచ్చిన రిపోర్టుతో జత చేశారు. తెల్లవారుజామున 1.30 గంటల వరకు జరిగిన ఘటనలతో కూడిన పూర్తి నివేదిక అందించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెల్ ఫోన్, సూసైడ్ నోట్స్ సహా సీజ్ చేసి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు.