సతీష్ నీనసాం, సప్తమి గౌడ జంటగా వినోద్.వి.దుండలే తెరకెక్కించిన చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం నిర్మించారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 27న సినిమా విడుదల కానుంది. రవిశంకర్ తెలుగులో పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘ఈ చిత్ర దర్శకుడు షూటింగ్ సమయంలో మరణించగా సతీష్ పూర్తి చేశారు. కన్నడ నుంచి వచ్చే రూటెడ్ సినిమాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా. అలాగే సప్తమి తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని చెప్పారు. హీరో సతీష్ నీనసాం మాట్లాడుతూ ‘ఇది కేవలం కమర్షియల్ సినిమానే కాదు ఇదొక డిఫరెంట్ మూవీ. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.
సప్తమి గౌడ మాట్లాడుతూ ‘ఇందులో అంబిక అనే పాత్రలో నటించా. ఇదొక గ్రామం గురించి, ఓ కమ్యూనిటీ గురించిన కథ. గొప్ప మేసేజ్ తో పాటు చాలా ఎమోషన్స్ ఉన్నాయి. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే సినిమా. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పింది. ఏపీ, తెలంగాణతో పాటు ఒరిస్సాలో విడుదల చేస్తున్నట్టు కళా సృష్టి అధినేత రవిశంకర్ చెప్పారు.
