
రంగారెడ్డి జిల్లా గండిపేట్ బృందావన్ కాలనీలో రౌడీలు రెచ్చిపోయారు. కత్తులు, హాకీ స్టిక్స్ తో పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసుల పైకి కుక్కలను వదలండంటూ రెచ్చిపోయారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ అతని స్నేహితుడు ప్రవీణ్ కేసు విచారణ కోసం పోలీసులు బృందావన్ కాలనీ దగ్గరకు వెళ్లారు. రూ. 25 కోట్ల రూపాయల విలువ చేసే స్థలం దగ్గర తిష్ట వేసి హల్‌చల్ చేశారు రౌడీషీటర్లు. అయితే ఈ సైట్ ఎవరిది? ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించడంతో ఒక్కసారిగా నార్సింగీ పోలీసుల పైకి తిరగబడ్డారు.
భయబ్రాంతులను గురైన పోలీసులు బలగాలను రప్పించారు. దీంతో పోలీస్ ఫోర్స్ ను చూసి పారిపోయారు. రౌడీల్లో నలుగురిని పట్టుకున్నారు పోలీసులు. అహ్మద్ ఖాన్, షేక్ హమ్దన్, మహ్మద్ జాఫర్, హామద్ మసూద్ పై 132 BNS కింద కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారు. దీంతో కోర్టు వారికి 7 రోజుల రిమాండ్ విధించింది.
జూలై 11న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన డెకాయి ఆపరేషన్‌లో తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని పోలీసులు ప్రశ్నించగా, తమ వెంట తెచ్చుకున్న గొడ్డలితో పాటు రాళ్లతో పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసులపై రౌడీలు దాడి చేయగా పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే..