ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయం

ఆర్టీసీకి  పెరుగుతున్న ఆదాయం

హైదరాబాద్‌‌, వెలుగు: పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఆదాయం పెరుగుతుండటంతో సంస్థ కుదుటపడుతోంది. ఇప్పటిదాకా అంతంత మాత్రంగానే ఉన్న కలెక్షన్‌‌ మెరుగైంది. సోమవారం ఒక్క రోజే ఏకంగా రూ. 15 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా తర్వాత ఇంత ఎక్కువగా ఆదాయం రావడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు. ఆక్కుపెన్సీ రేషియో (ఓఆర్‌‌) 80.60 శాతంగా నమోదైంది. ఆర్టీసీ 35 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడపగా, కిలోమీటరుకు రూ. 42.57 చొప్పున ఇన్‌‌కం వచ్చింది. తొలిసారిగా గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ జోన్‌‌లో ఓఆర్ 85.3 శాతానికి చేరుకోవడంతో ఆదాయం పెరిగింది. ఇటీవల ఆర్టీసీ వరుసగా సెస్‌‌లు, రౌండ్‌‌ ఫిగర్‌‌ పేరుతో ఛార్జీలు పెంచడమే కాకుండా, పెళ్లిల సీజన్‌‌ కావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో అత్యధిక ఇన్ కం నమోదైనట్లు తెలుస్తున్నది.