ముసద్దిలాల్​ జువెల్లర్స్‌‌లో రెండోరోజు ఈడీ సోదాలు

ముసద్దిలాల్​ జువెల్లర్స్‌‌లో రెండోరోజు ఈడీ సోదాలు

హైదరాబాద్ లో‌ని ముసద్దిలాల్ జెమ్స్‌‌ అండ్‌‌ జువెల్లర్స్‌‌లో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ)  అధికారుల సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. గోల్డ్ స్టాక్, సేల్స్ రికార్డ్స్‌‌, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుండి రూ.504 కోట్ల విలువైన బంగారాన్ని ముసద్ధిలాల్ సంస్థ తీసుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు.  బంగారాన్ని అంతా ముసద్దిల్లాల్ సంస్థ విక్రయించినట్టు MMTC గుర్తించింది. గతంలో ముసద్ధీలాల్ సంస్థకు వన్ టైం సెటిల్ మెంట్ కు  MMTC అవకాశం ఇచ్చింది.ఆ అవకాశాన్ని కూడా సంస్థ వినియోగించుకొలేదని తెలిపింది. దీంతో సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీనిపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బంగారం అమ్మగా వచ్చిన లాభాలను ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. 

సోమవారం కూడా ఈడీ అధికారులు హైదరాబాద్‌‌, విజయవాడ, గుంటూరు‌‌ సహా మొత్తం15 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌‌ ఎర్రమంజిల్‌‌, సికింద్రాబాద్‌‌లోని షో రూంలో రాత్రి 9 గంటల వరకు సోదాలు జరిగాయి.పెద్దనోట్ల రద్దు సమయంలో ముసద్దిలాల్​ జ్యువెలర్స్ భారీ అవకతవకలకు పాల్పడినట్లు  గతంలోనే ఈడీ కేసు నమోదు చేసింది. నిరుడు ఫిబ్రవరిలో రూ.130 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుంచి మరోసారి సోదాలు చేశారు. రాత్రి 9 గంటలదాకా  తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. గోల్డ్‌‌ స్టాక్‌‌ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై విచారించారు. సేల్స్‌‌ రికార్డ్స్‌‌లోని వివరాలు సేకరించారు. ట్యాక్స్‌‌ చెల్లింపులకు సంబంధించిన ఇన్వాయిస్‌‌లను పరిశీలించారు.