రెండో రోజు ఫార్మాసిటీ బాధిత రైతుల పాదయాత్ర

రెండో రోజు ఫార్మాసిటీ బాధిత రైతుల పాదయాత్ర

హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీలో భూములు కోల్పోతున్న  నిర్వాసితులు రెండో రోజు నిరసన కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ధ గ్రామాలకు చెందిన బాధితులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఫార్మాసిటి అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేడిపల్లి నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించిన నిర్వాసితులు తొలి రోజు మేడిపల్లి నుండి ఇబ్రహింపట్నం వరకు పాదయాత్రగా చేశారు. రాత్రికి అక్కడే బస చేసిన రైతులు ఉదయం ఆర్డీవో ఆఫీసు వరకు రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు.

ఆన్ లైన్ పహనీలో రైతుల పేర్లు నమోదు చేయాలని, బాధిత రైతులకు రైతు బంధు అమలు చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.  క్రాప్ లోన్స్ ఇవ్వడంతో పాటు ఆ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని అంటున్నారు. పార్టీలకు అతీతంగా కొనసాగుతున్న ఈ పాదయాత్రలో వందల సంఖ్యలో రైతులు పాల్గొంటున్నారు.