ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్ ఓపెన్

ఆగస్టు 15 తర్వాతే స్కూల్స్ ఓపెన్
  • అకడమిక్ ఇయర్​పై స్టడీకి కమిటీ
  • త్వరలోనే ఏర్పాటు చేయనున్న సర్కారు
  • క్లాస్ రూం, స్కూల్ పరిసరాలు ఎట్లుండాలి?
  • లెసన్స్, సిలబస్ ఎంత ఉండాలి?
  • చర్చించనున్న కమిటీ.. సభ్యులుగా పలువురు మంత్రులు

హైదరాబాద్, వెలుగుఆగస్టు 15 తర్వాతే స్కూళ్లను ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అకడమిక్ ఇయర్ ను ఆలస్యంగా ప్రారంభించాలని ఆలోచిస్తోంది. ఈ విషయంలో కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఉన్నాయని పెద్దాఫీసర్లు అంటున్నారు. ఆగస్టు రెండో వారం తర్వాతే విద్యా సంవత్సరం ప్రారంభించాలని సెంట్రల్ నుంచి సమాచారం వచ్చిందని చెబుతున్నారు. కరోనా​ను దృష్టిలో పెట్టుకుని అకడమిక్ ఇయర్ ను చేంజ్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. క్లాస్ రూం ఎలా ఉండాలి? స్కూల్ పరిసరాల్లో ఎలాంటి మార్పులు చేయాలి? టీచింగ్ ఎట్ల చేయాలి? అనే అంశాలపై స్డడీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ మేరకు అకడమిక్ ఇయర్ ప్లానింగ్ కోసం త్వరలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ఈ కమిటీలో హెల్త్, మున్సిపల్, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్స్, సీఎస్ సభ్యులుగా నియమించే చాన్స్ ఉంది. పేరెంట్స్, టీచర్స్, స్కూల్స్ మేనేజ్ మెంట్స్ ను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందరి అభిప్రాయాలను తీసుకోవాలని యోచిస్తోంది.

సిలబస్ లో కోత

ప్రస్తుతం ఉన్న సిలబస్ ను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉంది. అకడమిక్ ఇయర్ లో 227–230 పనిదినాలు ఉంటాయి. ఇప్పుడు దాదాపు 50 పనిదినాలు తగ్గనున్నాయి. దీంతో సిలబస్ ను తగ్గించే చాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా బోర్డు ఎగ్జామ్స్ ఉండే టెన్త్, ఇంటర్ లపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

ఎడ్యుకేషన్ సెక్రటరీపై సీఎం గుస్సా?

ఎడ్యుకేషన్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ పై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె తీరు వల్లే టెన్త్ ఎగ్జామ్స్ విషయంలో గందరగోళం నెలకొందని విమర్శలు ఉన్నాయి. సీఎస్ ను కనీసం సంప్రదించలేదని, సెక్రటరీ ఒంటెద్దు పోకడల వల్లే ఎగ్జామ్స్ విషయంలో ఇబ్బందులు వచ్చాయని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎగ్జామ్స్ నిర్వహణపై వివరించేందుకు స్వయంగా కోర్టుకు హాజరైనా.. సర్కారు వాయిస్​ను వినిపించడంలో ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారు.

కరోనా టెస్టులపై సర్కారు పంతం..హైకోర్టు చెప్పినా వినట్లే..