కేసీఆర్​కు ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్ల సమస్యను పరిష్కరించే టైమ్ లేదా?

కేసీఆర్​కు ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్ల సమస్యను పరిష్కరించే టైమ్ లేదా?
  • విద్యాశాఖ మంత్రి ఇల్లు ముట్టడించినా స్పందించరా?
  • బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ యాదవ్

ముషీరాబాద్, వెలుగు : బాసరలోని ట్రిపుల్​ ఐటీలో మౌలిక వసతుల కోసం స్టూడెంట్లు నెలరోజులుగా పోరాడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని  బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. సోమవారం  బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టూడెంట్ల తల్లిదండ్రులు విద్యాశాఖ మంత్రి ఇంటిని ముట్టడించినా అధికారుల్లో చలనం రాలేదన్నారు.  కలుషిత ఆహారంతో స్టూడెంట్లు అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరితే  వారిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ టైమ్ లేదా అని ఆయన ప్రశ్నించారు.

బాసర ట్రిపుల్​ ఐటీలో ఇన్ చార్జి వీసీని తొలగించి రెగ్యులర్ వైస్ చాన్సలర్ ను నియమించాలన్నారు. మెస్ ను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించి స్టూడెంట్లకు క్వాలిటీ ఫుడ్ అందేలా చూడాలన్నారు. ఐఐఐటీలో సమస్యలను పరిష్కరించకపోతే స్టూడెంట్ల తల్లిదండ్రులతో కలిసి బీసీ సేన ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పెద్దయ్య యాదవ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి, నిరంజన్ యాదవ్ , రామస్వామి, మధు పాల్గొన్నారు.