Video Viral: బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.. వేప చెట్టుకు.. మామిడి కాయలు.. ఎక్కడంటే...

Video Viral: బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.. వేప చెట్టుకు.. మామిడి కాయలు..  ఎక్కడంటే...

హైటెక్​ యుగంలో ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా సోషల్​ మీడియా ద్వారా వైరల్​ అవుతుంది.  అయితే అన్నీ విషయాలు నమ్మసక్యంగా లేకపోయినా కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.  ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో చోటు చేసుకున్న ఓ ప్రకృతి వింత ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి కార్మిక శాఖ మంత్రి అధికార నివాస ప్రాంగణంలో ఉన్న ఓ వేపచెట్టుకు మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్య వ్యక్తం చేస్తుంది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందినప్పటి నుంచి ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది స్మార్ట్ ఫోన్ వాడుతూ ప్రతి విషయాన్ని అందరికీ తెలిసేలా నెట్టింట షేర్ చేస్తున్నారు. కలియుగంలో చాలా వింతలు జరుగుతున్నాయి అందుకే విపత్తులు వస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఇదంతా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పారు అని వాదించేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ వింత చోటుచేసుకుంది. 

వేప చెట్టుకు మామిడికాయలు కాస్తున్నాయి. గుత్తులు గుత్తులుగా వేలాడిన మామిడి కాయలను చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. అసలు విషయంలోకి వెళితే.. బోపాల్ రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ అధికారిక నివాసం సమీపంలో ఓ వేప చెట్టు ఉంది. దానికి మామిడికాయలు కాయడం మంత్రి గమనించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాసంలో వేప చెట్టుకు గుత్తులుగా మామిడి కాయలు కాశాయి. మంత్రి స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

మంత్రి  తన ఇంటి ఆవరణలోని వేప చెట్టును దగ్గరకెళ్లి చూసి ఆశ్చర్యపోయినట్లు… వేపచెట్టుకు మామిడికాయలు చూసి తన మనసు పులకరించిపోయింది అని రాసుకొచ్చారు. అంతే కాకుండా ఎంతో ప్రతిభ గల తోటమాలి ఈ ప్రయోగం చేసి ఉంటాడని, నిజంగా ఇది గొప్ప అద్భుతం అని పోస్టు చేశాడు. అంతే కాదు మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలయజేశారు. అధికారులు ఆ చెట్టును పరిశీలించారు. వేపచెట్టుకు సుమారు 20 నుంచి 25 ఏళ్లు ఉంటాయని, వేప కొమ్మలో మామిడి కొమ్మ కూడా ఉందని చెప్పారు. అయితే వేపకొమ్మపై మామిడి పూత పడడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని ప్రతిభా సింగ్ లో వృక్షశాస్త్రజ్ఞుడు చెప్పారు.. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.