రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ రాంపేజ్..

రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ రాంపేజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రికార్డుల వేట మొదలు పెట్టేశాడు. సలార్(Salaar) దెబ్బకు యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. జులై 6 ఉదయం 5:12 నిమిషాలకు రిలీజైన ఈ టీజర్ కు దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

దీంతో.. ఈ టీజర్ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. టీజర్ రిలీజైన కేవలం 12 గంటల్లోనే 45 మిలియన్ వ్యూస్, 1.4M లైక్స్  సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. నిమిష నిమిషానికి ఈ కౌంట్ పెరుగుతూనే ఉంది. #1ట్రెండింగ్ లో  ఉన్న సలార్ టీజర్ భయంకరమైన వ్యూస్ పెరుగుతూ వస్తోంది. 

ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సలార్ మూవీ టీజర్ ను సింగిల్ డైలాగ్ తో ఫినీష్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel). అది కూడా ఇంగ్లీష్ లో. ఈ కారణంగానే సలార్ టీజర్ కు ఇండియా వైడ్ గా భారీ రెస్పాన్స్ వచ్చింది. 

మరి టీజర్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సలార్ మూవీ.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు ఆగాల్సిందే.