సెక్రటేరియట్ కూల్చివేత : పిటిషన్ కొట్టివేసిన‌ సుప్రీం కోర్టు

సెక్రటేరియట్ కూల్చివేత : పిటిషన్ కొట్టివేసిన‌ సుప్రీం కోర్టు

సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత, కొత్త భవన సముదాయం నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. శుక్ర‌వారం తెలంగాణ సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జూన్ 29న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్ ‌రెడ్డి కోరారు. సచివాలయ కూల్చివేత అంశంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది సుప్రీంకోర్టు. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఎం.ఆర్ షాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. సెక్రటేరియట్ నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం.. అందులో న్యాయస్థానం జోక్యం చేసుకోదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్తల కోసం..