తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ పెంపు

తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ పెంపు

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3,016 నుంచి 4,016 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జులై నెల నుంచే దివ్యాంగులు రూ.4,016 పెన్షన్ అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో 5 లక్షల మందికిపైగా వికలాంగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి.. ధన్యవాదాలు తెలిపారు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్. 

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అత్యధిక పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అన్నారు.