ఒకే రోజు ఐదు జీవోలు రిలీజ్

ఒకే రోజు ఐదు జీవోలు రిలీజ్

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ వరుసబెట్టి జీవోలు రిలీజ్ చేసింది. ఒకేరోజు.. ఐదు జీవోలిచ్చింది. సెప్టెంబర్ ఒకటి నుంచి  అన్ని విద్యాసంస్థలు ఓపెన్ చేస్తూ ఒక జీవో ఇచ్చింది సర్కార్. హుజూరాబాద్ దళితబంధు కోసం మరో 200 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దళితబంధు కోసం ఇప్పటికే వెయ్యి కోట్లు ఇవ్వగా.. ఇప్పుడు 200కోట్లతో మొత్తం 1200 కోట్లు రిలీజ్ చేసినట్లైంది.

గజ్వేల్ డెవలప్ మెంట్ అథారిటీకి అభివృద్ధి పనుల కోసం 100 కోట్లు ఇస్తూ మరో జీవో రిలీజ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు రెండున్నర కోట్ల చొప్పున మొత్తం 382 కోట్లు కేటాయిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇక విద్య, ఉద్యోగాల్లో EWS కోటా అమలు కోసం జీవో ఇచ్చింది సర్కార్. 8లక్షల లోపు ఆదాయం ఉన్న ఓసీ వర్గాలు.. విద్య, ఉద్యోగ నియామకాల్లో 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆదేశాలిచ్చింది సర్కార్.