
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో.. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో.. పనిచేస్తున్న కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. మాస్క్ పెట్టుకోకపోతే.. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 188 కింద వెయ్యి రూపాయల ఫైన్ కట్టాల్సిందేనని చెప్పింది సర్కార్. ఇంటి నుంచి బయటకు వస్తే.. ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనని సూచించింది.