కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి

కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి
  • కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి
  • జస్టిన్ ట్రూడోకు యునైటెడ్ హిందూ ఫ్రంట్ సూచన

న్యూఢిల్లీ : ఖలిస్తానీయులపై అంత ప్రేమ ఉంటే కెనడాలోనే కొంత భాగాన్ని విడదీసి ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోకు యునైటెడ్‌‌ హిందూ ఫ్రంట్ (యూహెచ్‌‌ఎఫ్‌‌) సూచించింది. ఖలిస్తానీ టెర్రరిస్టులకు మద్దతు ప్రకటిస్తున్న ట్రూడో కు వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌‌‌‌ మంతర్ వద్ద యూహెచ్‌‌ఎఫ్‌‌ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఫ్రంట్‌‌ నేతలు మాట్లాడుతూ.. ఖలిస్తానీయులకు ట్రూడో మద్దతు కొనసాగించాలనుకుంటే కెనడాలో కొంత భాగాన్ని విడగొట్టి, ఖలిస్తాన్‌‌ దేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయరని ఫ్రంట్‌‌ ఇంటర్నేషనల్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ జై భగవాన్‌‌ గోయల్‌‌ ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వం పదేపదే నినసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఖలిస్తానీలపై ట్రూడో వైఖరి మారడం లేదన్నారు. ఖలిస్తానీలను ఇలాగే రక్షిస్తే కెనడా యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులను వెనక్కి పిలిపిస్తామని ఆయన హెచ్చరించారు. భవిష్యత్‌‌లో భారత్‌‌ నుంచి కెనడాకు ఉన్నత విద్య కోసం స్టూడెంట్లు ఎవరూ రారని హెచ్చరించారు.