మనకు అమెరికా బాకీ రూ.16 లక్షల కోట్లు!

మనకు అమెరికా బాకీ రూ.16 లక్షల కోట్లు!
  •     అమెరికా మొత్తం అప్పు 29 లక్షల కోట్ల డాలర్లు

న్యూఢిల్లీ: అమెరికా ఎకానమీ ప్రపంచంలోనే అతిపెద్దదే అయినా ఈ దేశానికి అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. ఇండియాకే 216 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16 లక్షల కోట్లు) అప్పు చెల్లించాల్సి ఉంది. విదేశీ అప్పు విలువ 29 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అంటే ప్రతి అమెరికన్‌‌ తలపై 72,309 డాలర్లు (దాదాపు రూ.53 లక్షలు) అప్పు ఉన్నట్టు లెక్క! తాము చైనా, జపాన్‌‌కు ఎక్కువ బాకీలు ఉన్నామని సెనేటర్‌‌ అలెక్స్ మూనీ వెల్లడించారు. చైనాకు లక్ష కోట్ల డాలర్లు, జపాన్‌‌కు లక్ష కోట్ల డాలర్ల చొప్పున చెల్లించాలని అన్నారు. విదేశాలకు ఇంత భారీగా ఉన్నప్పుడు 2 లక్షల కోట్ల స్టిములస్‌‌ ప్యాకేజీని ప్రకటించడం సరికాదని అన్నారు.  2050 నాటికి అమెరికా అప్పు 104 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని మూనీ వివరించారు.