
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే(Radhika Apte) నటించిన హాలీవుడ్ మూవీ ది వెడ్డింగ్ గెస్ట్(The Wedding Guest). స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్(ft. Dev Patel) హీరోగా వచ్చిన ఈ సినిమాను మైఖేల్ వింటర్‌బాటమ్(Michael Winterbottom) తెరకెక్కించాడు. 2019లో బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఇండియాలో తప్పా మిగతా అన్ని దేశాల్లో విడుదలైంది. కానీ, ఆడియన్స్ ను అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే నటించిన శృంగార సన్నివేశం విడుదలకు ఉండే లీక అవడంతో ఈ సినిమా అప్పటిలో సంచలనంగా మారింది.
అయితే.. దాదాపు ఐదేళ్ల తరువాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఓటీటీ
హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఈ సినిమాను చేసేందుకు తగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు ఓటీటీలో మంచి డిమాండ్ ఏర్పడింది. మరి వీలుంటే మీరు కూడా చూసేయండి.