అల్లర్లకు కారణమెవరో కళ్లు లేనోళ్లకు కూడా తెలుసు

అల్లర్లకు కారణమెవరో కళ్లు లేనోళ్లకు కూడా తెలుసు
  • తీస్తా సెతల్వాద్‌ అరెస్టు దారుణం
  • సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

హైదరాబాద్:  తీస్తా సెతల్వాద్  అరెస్టు దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  అన్నారు. 22 ఏళ్ల క్రితం గుజరాత్ లో జరిగిన అల్లర్లపై సెతల్వాద్ సుదీర్ఘపోరాటం చేశారని ఆయన గుర్తుచేశారు. సెతల్వాద్ పై అత్యున్నత న్యాయవ్యవస్థ తన పరిధిని దాటి వ్యాఖ్యలు చేసిందని తాను భావిస్తున్నానన్నారు. గుజరాత్  అల్లర్లకు కారణమెవరనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు.  కళ్లు లేని వ్యక్తులకు కూడా ఆ అల్లర్లకు కారణమెవరనేది స్పష్టంగా తెలుసని ఆదివారం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో నారాయణ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ సైతం తాము ఇచ్చిన తీర్పుపై పునః పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు.