వీధి కుక్క కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

వీధి కుక్క కనిపించట్లేదంటూ  పోలీసులకు ఫిర్యాదు
  • కూకట్​పల్లి పీఎస్​లో మహిళ కంప్లయింట్​

కూకట్​పల్లి, వెలుగు: తాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న వీధి కుక్క కనిపించట్లేదని ఓ మహిళ కూకట్​పల్లి పోలీసులకు కంప్లయింట్​ చేసింది. కూకట్​పల్లిలోని రెయిన్​బో విస్టాలో ఉండే గంటి అన్నపూర్ణ సాఫ్ట్​వేర్​ ఎంప్లాయ్​. ఆ కమ్యూనిటీలో తిరిగే ఒక స్ట్రీట్​డాగ్​కు ఆమె రోజూ అన్నం పెడుతూ ఉండేది. ఆ కుక్కతో పాటు డైలీ చాలా కుక్కలు రావడం మొదలుపెట్టాయి. గమనించిన కాలనీ అసోసియేషన్ నిర్వాహకులు కుక్కలకు ఫుడ్​పెట్టొద్దని అన్నపూర్ణపై ఒత్తిడి చేశారు. కానీ ఆమె ఫుడ్​పెట్టడం ఆపలేదు. డైలీ వచ్చే కుక్క వారం రోజులుగా కనిపించకుండా పోవడంతో బుధవారం అన్నపూర్ణ పోలీసులను ఆశ్రయించింది. కుక్క మిస్సింగ్​కు అసోసియేషన్ నిర్వాహకులే కారణమంటూ కంప్లయింట్​ ​చేసింది.