పెండ్లికి వెళ్లొచ్చేసరికి నగలు మాయం..8 తులాల బంగారం, 35 తులాల వెండి చోరీ

పెండ్లికి వెళ్లొచ్చేసరికి నగలు మాయం..8 తులాల బంగారం, 35 తులాల వెండి చోరీ

అల్వాల్ వెలుగు : ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. డీఐ తిమ్మప్ప తెలిపిన ప్రకారం... అల్వాల్​ పోలీస్​స్టేషన్​ పరిధి శివానగర్ కాలనీలో నివాసముంటున్న ఆనంద్ తన కుటుంబ సభ్యులతో కలిసి  తిరుపతిలో ఓ మ్యారేజ్​ ఫంక్షన్​కు హాజరయ్యేందుకు మూడు జుల క్రితం వెళ్లాడు. 

సోమవారం రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. 8 తులాల బంగారం, 35 తులాల వెండి చోరీకి గురయ్యాయి. పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు.