దేశంలో 718 మంచు చిరుతలు .. నేషన్ వైడ్  రివ్యూ సర్వేలో వెల్లడి

దేశంలో 718 మంచు చిరుతలు .. నేషన్ వైడ్  రివ్యూ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 718 మంచు చిరుతలు ఉన్నాయని నేషన్ వైడ్  రివ్యూ సర్వేలో తేలింది. ఐదేండ్ల పాటు 1.20 లక్షల చదరపు కిలోమీటర్లలో మొట్టమొదటిసారిగా జాతీయవ్యాప్త సర్వే నిర్వహించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. 2 వేల లొకేషన్లలో కెమెరాలు అమర్చి 200 ప్రాంతాల్లో 241 మంచు చిరుతల కదలికలను గమనించామని ఆ శాఖ వెల్లడించింది.

కాగా, ఈ మంచు చిరుతలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. చర్మంపై నల్లటి మచ్చలు, దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. కాళ్లకు చలి నుంచి రక్షణ కల్పించడానికి వెడల్పాటి పంజా ఉంటాయి. ఈ చిరుతలు చాలా వేగంగా కదులుతాయి. వీటి శాస్త్రీయ నామం ‘పాంథెరా అన్సియా’. ప్రస్తుతం ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయని ‘ఇంటర్నేషనల్  యూనియన్  ఫర్  కన్జర్వేషన్  ఆఫ్  నేచర్’ తెలిపింది.